Viral Video: సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు.. వీడియో చుస్తే ఔరా అనాల్సిందే..!

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో గల ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్​ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ 2వేల రూపాయల నోట్లే అని అధికారులు చెప్పారు.

Anil kumar poka

|

May 14, 2022 | 9:06 PM


రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో గల ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్​ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ 2వేల రూపాయల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్​ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్లు అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నోట్లను సరస్సులో వదిలేశారని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu