అసలే ఎండకాలం… ఒక వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు నీటి లభ్యత తగ్గిపోయింది. చెరువులు సైతం ఎండిపోవటంతో పచ్చి గడ్డి దొరకడమే గగనమై పోయింది. దీంతో గేదెల పొలాలపై పడి మేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల పొలాల్లో విచిత్ర సంఘటన జరిగింది. పొలాలపై మేత కోసం వెళ్లిన గేదె రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. బయటకు రాలేక అష్టకష్టాలు పడింది. ఇక లాభం లేకపోవడంతో రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కపోయి కదలకుండా ఉండి పోయింది. ఆ దారిలో పోతున్న రైతులు గేదె రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించారు. గేదెను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా రైతుల వల్ల కాలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పటికే గేదె ఇరుక్కు పోయి పది గంటలు దాటి పోయింది. దీంతో ఒక చెట్టును కోయక తప్పలేదు. రైతులు చెట్టును కోసే యంత్రం తీసుకొచ్చి రెండు చెట్లలో ఒక దాన్ని కోసి గేదెను బయటకు తీశారు. దాంతో దాని యజమాని సంతోషంగా గేదెను ఇంటికి తోలుకు పోయాడు. గేదె ధర లక్ష రూపాయల వరకూ ఉంటుందని రైతు చెప్పాడు. అందరి సాయంతో గేదెను ప్రాణంతో బయటకు తీయడం సంతోషంగా ఉందని రైతు చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్
కార్తికేయ కోసం.. కోట్ల లగ్జరీ కారును లెక్కచేయని
10 కోట్ల ఇస్తామన్నా… మాటకు కట్టుబడి నో అన్నాడు !! దటీజ్ అల్లు అర్జున్ !!
భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్