ఎలిఫెంట్ రెస్టారెంట్.. పసందైన విందు రెడీ !!
ఇప్పటి వరకూ మీకు మనుషుల కోసం ఏర్పాటు చేసే రకరకాల రెస్టారెంట్ల గురించి తెలుసు. ఈ రెస్టారెంట్లలో కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు పసందైన వంటకాలు వడ్డిస్తారు.
ఇప్పటి వరకూ మీకు మనుషుల కోసం ఏర్పాటు చేసే రకరకాల రెస్టారెంట్ల గురించి తెలుసు. ఈ రెస్టారెంట్లలో కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు పసందైన వంటకాలు వడ్డిస్తారు. స్పెషల్ డిషెష్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటారు. అయితే జంతువులకు కూడా ఇలాంటి రెస్టారెంట్‌లు ఉంటే ఎలాఉంటుంది? జంతువులకు రెస్టారెంట్‌ఏంటి?… వాటికి అడవులన్నీ రెస్టారెంట్లే కదా అంటారా… కానీ తమిళనాడుకు చెందిన కొందరు మూగ జీవుల కోసం ఓ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అదికూడా ఏనుగులు మాత్రమే నండోయ్.. అన్నిటికీ కాదు.. తమిళనాడులో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ కు ఇప్పుడు గజరాజుల యజమానులు క్యూ కట్టారు. సురేందర్ మెహ్రా అనే భారతీయ అటవీ అధికారి మదుమలైలో ఏనుగుల కోసం తెప్పకడు అనే ఓ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పశువైద్యుని పర్యవేక్షణలో ఏనుగుల కోసం ఆహారం తయారుచేయడం జరుగుతుంది. జొన్న, బియ్యం, ఉప్పు, బెల్లంతో ఇక్కడ పెద్ద ముద్దలు తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షల మందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!
ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ ఏం చేశాడో తెలుసా !!
ట్రెడ్‌మిల్‌పై స్టన్నింగ్ స్టెప్స్.. హాయ్ రామా అంటూ..
ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్.. ఎక్కడో తెలుసా ??