Bank Card Details: నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌ వ్యవస్థాపకుడి ఆఫర్‌..

|

Sep 06, 2024 | 9:20 PM

సాధారణంగా తమ క్రెడిట్‌, డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అత్యంత సీక్రెట్‌గా ఉంచుతారు. అవన్నీ బయటకు తెలిస్తే ఎకౌంట్ ఖాళీ అవ్వడానికి క్షణం పట్టదు..! అలాంటిది అన్నీ తెలిసి ఓ కంపెనీ కో ఫౌండర్‌ తన డెబిట్ కార్డు వివరాలను ఏకంగా తన ‘ఎక్స్‌’ లోనే షేర్‌ చేశాడు. అంతేనా.. దాన్ని వాడుకుని తమకు నచ్చింది కొనుక్కోండంటూ నెటిజన్లకు బంపరాఫర్‌ ఇచ్చాడు. ఇంకేముంది.. కొనుగోళ్లకు నెటిజన్లు పోటెత్తారు..!

సాధారణంగా తమ క్రెడిట్‌, డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అత్యంత సీక్రెట్‌గా ఉంచుతారు. అవన్నీ బయటకు తెలిస్తే ఎకౌంట్ ఖాళీ అవ్వడానికి క్షణం పట్టదు..! అలాంటిది అన్నీ తెలిసి ఓ కంపెనీ కో ఫౌండర్‌ తన డెబిట్ కార్డు వివరాలను ఏకంగా తన ‘ఎక్స్‌’ లోనే షేర్‌ చేశాడు. అంతేనా.. దాన్ని వాడుకుని తమకు నచ్చింది కొనుక్కోండంటూ నెటిజన్లకు బంపరాఫర్‌ ఇచ్చాడు. ఇంకేముంది.. కొనుగోళ్లకు నెటిజన్లు పోటెత్తారు.! ‘బోల్డ్‌కేర్‌ ’ అనే స్టార్టప్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ కృష్ణన్‌ సోమవారం తన ఎక్స్‌ ఖాతాలో ఈ పోస్ట్‌ చేశాడు. బ్యాంకు డెబిట్‌ కార్డు నంబరు, ఎక్స్‌పెయిరీ డేట్‌, సెక్యూరిటీ కోడ్‌ డీటైల్స్‌ షేర్‌ చేశాడు. అయితే దీనికో షరతు పెట్టాడు. తన కార్డు వాడుకుని యూజర్లు రూ.1000 వరకు మాత్రమే కొనుగోళ్లు చేయాలని చెప్పాడు. ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయడం కోసం తనకు వచ్చే ఓటీపీని కూడా షేర్‌ చేస్తానన్నాడు. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేశారు. వాటికి వచ్చిన ఓటీపీలను కూడా ఆయన ‘ఎక్స్‌’లోనే షేర్‌ చేయడంతో మరింత ఎక్కువ మంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్నారు. కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. కేవలం 5 గంటల్లోనే దాదాపు 200లకు పైగా ఓటీపీలను ఆయన షేర్‌ చేశాడు. అత్యధికంగా జొమాటో, స్విగ్గి, బ్లింకిట్‌, అమెజాన్‌ వంటి వాటి నుంచి నెటిజన్లు కొనుగోళ్లు చేశారు.

అయితే, కొన్ని గంటల తర్వాత తన కార్డు బ్లాక్‌ అయినట్లు రాహుల్‌ మరో పోస్ట్‌లో తెలిపాడు. సాధారణంగా ఓటీపీలను షేర్‌ చేయడం అనేది ఆర్‌బీఐ రూల్స్‌కు విరుద్ధం. దీనికి తోడు అసాధారణ, అనుమానాస్పద లావాదేవీలు జరపడంతో ఆయన కార్డును సంబంధిత బ్యాంకు ఫ్రీజ్‌ చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ యూజర్లు ఇంకా కొనుగోళ్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారట. ఏదేమైనా ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 23లక్షల మందికి పైగా చూశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు తెలివైన పబ్లిసిటీ స్టంట్‌ అని చెబుతుండగా.. వెర్రి వెయ్యి రకాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బోల్డ్‌కేర్‌ అనేది పురుషుల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే స్టార్టప్‌ కంపెనీ. 2020లో కొంతమంది స్నేహితులతో కలిసి రాహుల్‌ దీన్ని ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే ఈ స్టార్టప్‌కు మంచి ఆదరణ లభించింది. గతేడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన 30 అండర్‌ ఆసియా రిటైల్‌ ఈ కామర్స్‌ జాబితాలో రాహుల్‌ చోటు దక్కించుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.