Delhi: ఢిల్లీలో ఘోరం.! వ్యక్తిపై వరుసగా వెళ్లిన వాహనాలు.. పొగమంచు కారణంగా కనిపించని మృతదేహం.
ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి వణికిస్తుంది. చల్లని గాలులతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో రోడ్లు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ అత్యంత దయనీయ స్థితికి పడిపోయింది. ఢిల్లీలోని లోధి రోడ్‌లో అత్యల్పంగా 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి వణికిస్తుంది. చల్లని గాలులతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో రోడ్లు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ అత్యంత దయనీయ స్థితికి పడిపోయింది. ఢిల్లీలోని లోధి రోడ్‌లో అత్యల్పంగా 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో వణికిస్తున్న పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వ్యక్తులు, వాహనాలు కనిపించని పరిస్థితి. ఇదే తాజాగా ఢిల్లీలో ఘోర ప్రమాద ఘటనకు దారితీసింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించని వాహనదారులు వేగంగా వెళ్లడంతో ఆ మనిషి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. దాంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. దేశ రాజధానిలో ఎన్‌హెచ్9 సమీపంలో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రహదారులను శుభ్రం చేస్తుండగా.. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు. ఆ తర్వాత వరుసగా వాహనాలు వెళ్లడంతో ఈ ఘోరం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos