secret room: ఇంటికి రంగులేస్తుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా.. అంత షాక్..!

Updated on: May 05, 2022 | 10:06 PM

ఓ బిజినెస్‌మాన్‌ ఇంటికి రంగులేసేందుకు వెళ్లిన నలుగురు కార్మికులు 2.5 కోట్ల క్యాష్‌ దొంగిలించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. తిరుప్పూర్‌కు చెందిన దురైస్వామికి


ఓ బిజినెస్‌మాన్‌ ఇంటికి రంగులేసేందుకు వెళ్లిన నలుగురు కార్మికులు 2.5 కోట్ల క్యాష్‌ దొంగిలించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. తిరుప్పూర్‌కు చెందిన దురైస్వామికి బనియన్‌ మిల్లులు ఉన్నాయి. ఆయన కుమార్తెకు ఇటీవల వివాహమైంది. ఇంట్లో భార్య ధనలక్ష్మితో పాటుగా దురైస్వామి ఉంటున్నారు. వీరి సేవలకు కొందరు పని వాళ్లు కూడా ఉన్నారు.కుమార్తె వివాహం సందర్భంగా ఇంటికి రంగులేయించారు దురైస్వామి. రంగులేసే కార్మికులు సతీష్, దామోదరన్, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణన్‌ను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సున్నం కొట్టే సమయంలో దురై స్వామి ఇంట్లో తమకు ఒక రహస్య గది కనిపించిందని, అందులోకి వెళ్లి చూడగా, కొన్ని చిన్న సంచుల్లో 2 వేల నోట్ల మూటలు కట్టి పడేసి ఉన్నాయని, అందులో ఓ సంచితో తాము ఉడాయించినట్టు అంగీకరించారు. దీంతో ఈ నలుగుర్ని అరెస్టు చేశారు. వీరు పట్టుకెళ్లిన 2.5 కోట్ల నగదు ఎక్కడ దాచి పెట్టారో వివరాల్ని నిందితుల వద్ద సేకరిస్తున్నారు. అలాగే 75 లక్షలు విలువైన బంగారంతో తమకు సంబంధం లేదని ఈ నిందితులు చెప్పడంతో ఆ దొంగల కోసం వేట ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Published on: May 05, 2022 10:06 PM