సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
సముద్రం అట్టడుగున అనేక జీవరాశులు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఎన్నో రకాల చేప జాతులు, అనేక వింతైన జీవాలు అక్కడ ఉంటాయి.
సముద్రం అట్టడుగున అనేక జీవరాశులు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఎన్నో రకాల చేప జాతులు, అనేక వింతైన జీవాలు అక్కడ ఉంటాయి. వాటిల్లో కొన్ని చూసేందుకు ఎంతో భయంకరంగా ఉంటాయి. అలాంటి ఓ భయంకర రూపంతో ఉన్న సముద్రపు జీవి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫోటోలపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని మిల్ బీచ్ ఒడ్డుకు ఓ వింత జీవి కొట్టుకొచ్చింది. అది చూడటానికి పిరానా చేపలా ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. సూదులు లాంటి పళ్ళు, పొడవాటి తోకతో చూడ్డానికి భయం కలిగిస్తోంది. మిల్ బీచ్ రాళ్ల వద్ద ఈ వింత జీవి కళేబరం ప్రజలకు దర్శనమివ్వడంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దాన్ని చూసి వోల్ఫ్ ఈల్ అని అంటే.. ఇంకొందరు అది కాకపోవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేసారు. అయితే చివరికి పరిశోధకులు అది మంకీఫేస్ ప్రికిల్ బ్యాక్ ఈల్ అని స్పష్టం చేశారు. ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని పసిఫిక్ కోస్టల్ రీజియన్‌లో కనిపిస్తాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో