Viral Video: అద్భుతంగా స్టంట్‌ చేశాడు.. కానీ చిన్న పొరపాటుతో !!

|

Jul 30, 2022 | 9:54 AM

వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో కొదవే లేదు. ఎప్పుడూ ఏదొక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది.

వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో కొదవే లేదు. ఎప్పుడూ ఏదొక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో యువత ఓవర్‌నైట్‌లోనే బాగా ఫేమస్ అయ్యేందుకు అక్కర్లేని స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైకులు, వ్యూస్ కోసం భయంకరమైన స్టంట్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రహదారి పక్కన కొందరు యువకులు ఉన్నారు. వారిలో ఓ యువకుడు బైక్‌తో అద్భుతంగా స్టంట్‌ చేశాడు. బైక్‌ను నేలపైన గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు ఆ యువకుడ్ని ఎంకరైజ్‌ చేస్తున్నారు. అయితే చివరిక్షణంలో బైక్‌ అదుపుచేయలేకపోయిన యువకుడు బైక్‌పైన నార్మల్‌ పొజిషన్‌కి వచ్చి రోడ్డుమీదకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ వాహనం ఆ బైకును ఢీకొట్టింది. దాంతో బైకు ఎగిరి అవతల పడింది. యువకుడు రోడ్డుపైన పడిపోయాడు. ఈ క్రమంలో అతని కాలుకి గాయమైనట్టు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాడిదను ఎగిరెగిరి తన్నిన యజమాని.. దెబ్బకు సీన్ రివర్స్.. కర్మఫలం అంటే ఇదే తమ్ముడూ అంటున్న నెటిజెన్స్

Viral: రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయింది ఈ పక్షి !!

Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు

Viral: ఈ చిలుక ఇంగ్లీష్‌ ముద్దుగా ముద్దుగా మాట్లాడుతూ అదరగొడుతుందిగా.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్విమ్మింగ్‌ పూల్‌లో సింక్‌ హోల్‌ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??

 

Published on: Jul 30, 2022 09:54 AM