వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్‌.. ఎందుకంటే ??

Updated on: Nov 02, 2025 | 2:48 PM

చత్‌ పూజలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది సూర్య దేవుడు, షష్ఠీ దేవిని ఆరాధించే పండుగ. షష్టీదేవిని ఛత్‌మాతగా కొలుస్తారు.ఈ పూజల సందర్భంగా బీహార్ లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఛత్ ప్రసాదం కోసం ఒక లోకో పైలట్‌ ఏకంగా ప్యాసింజర్ రైలును ఆపాడు.ఓ వ్యక్తి నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ట్రైన్‌ను ముందు పోనిచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చత్‌ పూజలు జరుగుతున్నాయి. పూజలు పూర్తి చేసిన భక్తులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అదే క్రమంలో ఆ ప్రాంతంలోని రైలు పట్టాలపై నుంచి ఓ ప్యాసింజర్‌ ట్రైన్ వెళ్తుంది. అ ట్రైన్ నడుపుతున్న లోకోపైలెట్‌.. పట్టాల పక్కనే భక్తులు ప్రసాదం పంపిణీ చేయడాన్ని గమనించాడు. వెంటనే ట్రైన్‌ ఆపేసి అక్కడున్న వ్యక్తులను ప్రసాదం ఇవ్వాలని కోరాడు. వెంటనే ఓ వ్యక్తి వచ్చి ఆయనకు ప్రసాదం అందజేశాడు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే నిజమైన సనాతన ధర్మమని ఒకరు కామెంట్ చేయగా.. అయితే భారతదేశంలో మాత్రమే ఇలాంటి భక్తి కలిగిన వారు ఉంటారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాగి నడిపితే.. నేరుగా జైలుకే..!

20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్‌

రాత్రివేళ యువతి, యువకుడు గోడదూకి

భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ వేధింపులు

ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌