Aadhaar update: ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక ప్రకటన..
ఆధార్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు కలిగిన ఈ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ కు గడువు డిసెంబర్ 14తో ముగియనుండగా.. ఇప్పుడు ఆ తేదీని పొడిగించింది. 14 జూన్ 2025 వరకు ఉచిత అప్‌డేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఉడాయ్ ప్రకటించింది. ఇప్పటికే అనేకసార్లు గడువును పొడిగిస్తూ వచ్చిన ఉడాయ్.. ఇప్పుడు మరోసారి ఈ అవకాశం కల్పించింది.
తొలుత ఉచిత అప్‌డేట్ గడువును జూన్ 14, 2024 వరకు ప్రకటించింది. ఆ తరువాత సెప్టెంబర్ 14, 2024 వరకు పొడిగించింది. ఆపై డిసెంబర్ 14, 2024 వరకు పెంచింది. ఇప్పుడు ఈ తేదీని ఏకంగా జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆధార్ అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్‌లో వివరాలను పోస్ట్ చేసింది. ఈ ఉచిత సేవ myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. UIDAI లో ఆధార్ అప్‌డేట్ చేయాలనుకునే వారు ముందుగా.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మి దగ్గర ఉంచుకోవాలి అని ఆధార్ సంస్థ సూచించింది. ఏవైనా మార్పులను మీ ఆధార్ డేటాబేస్‌లో పొందుపరచాల్సిన అవసరం ఉన్నట్లయితే.. తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మీరు దానిని అప్‌డేట్ చేసుకోవాలి. మీరు మీ పిల్లలకు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడే ఆధార్ కోసం నమోదు చేసినట్లయితే, బయోమెట్రిక్ రికార్డును కనీసం రెండుసార్లు అప్‌డేట్ చేయవలసి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి.. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరొకసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది అని పేర్కొంది. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫోటోలు వంటి బయోమెట్రిక్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు అన్నీ ఆఫ్‌లైన్‌లోనే జరుగుతాయి. సదరు వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.