6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
బరువు తగ్గాలనే ఆశతో ఒక ఇన్ఫ్లూయెన్సర్ ఆరు నెలలు కేవలం ఉడికించిన చికెన్, రెండు రకాల కూరగాయలు మాత్రమే తిని తీవ్ర ప్యాంక్రియాటైటిస్ బారిన పడింది. ఆమె క్లోమం పాడై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అనారోగ్యకరమైన డైటింగ్ పద్ధతులు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు.
బరువు తగ్గడం కోసం ఓ ఇన్‌ప్లూయెన్సర్ ఆరు నెలలు పాటించిన డైట్ ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. ఆమె కేవలం ఉడికించిన చికెన్ బ్రెస్ట్, రెండే రెండు కూరగాయలు మాత్రమే తింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వ్యాధి బారిన పడింది. అనారోగ్యకర డైటింగ్ పద్ధతులను ఫాలో కావడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేసింది. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్.. ఉడికించిన చికెన్ బ్రెస్ట్‌తో పాటు ఉడికించిన కాలీఫ్లవర్ మాత్రమే తీసుకుంది. అప్పుడప్పుడు చిన్న ఆలుగడ్డ ముక్కలు తినేది. నీరసం, అలసట, బలహీనంగా అనిపించినప్పటికీ అదే డైట్‌ను కొనసాగించింది. ఆరు నెలల తర్వాత ఆమెకు తీవ్ర కడుపు నొప్పి బాధించింది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. డాక్టర్లు ఆమెకు ప్యాంక్రియాటైటిస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పరిస్థితిలో ఆహారాన్ని జీర్ం చేసే ఎంజైమ్‌లు క్లోమంలో పేరుకుపోయి, క్లోమ అవయవాన్ని జీర్ణం చేయడం ప్రారంభించాయని షాకింగ్ వార్త బయటపెట్టారు. ఆమె సీరం అమైలేస్ స్థాయి సాధారణం కంటే పది రెట్లు ఎక్కువున్నట్లు వైద్యులు తెలిపారు. అమైలేస్ ఎంజైమ్ కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. చైనా మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్ క్లోమంలో ఎక్కువ భాగం నెక్రోటైజ్ అయింది. ఆమె పరిస్థితి ప్రాణాంతకమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితికి కారణం.. ఆమె చాలా కాలంగా తీసుకుంటూ వచ్చిన అతి తక్కువ కొవ్వున్న చప్పటి ఆహారమేనట. చప్పగా, తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్ స్రావం దెబ్బతిని క్లోమానికి హాని కలిగించిందట. క్లోమంలో ఏర్పడే ప్యాంక్రియాటైటిస్ వాపు వల్ల కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. అజీర్ణం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రక్తపోటు తగ్గి తల తిరగడం లాంటివి లక్షణాలు వస్తాయని వైద్యులు తెలిపారు. బరువు తగ్గాలని డైటింగ్ చేస్తూ కొవ్వు, కార్బోహైడ్రేట్‌ను పూర్తిగా మానేయడం కాకుండా అన్ని పోషకాలు అందేలా సమతుల్య, ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం.. అబ్బా అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు..
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ