Anakapalli: మినీ కాణిపాకంలో తమలపాకు వినాయకుడు.. రోజుకో అలంకరణ.
ఆంధ్రప్రదేశ్‌లో స్వయంభువుగా వెలసిన రెండు వినాయక క్షేత్రాల్లో.. మొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకం కాగా రెండవది అనకాపల్లి జిల్లా చోడవరం ఆలయం. ఈ ఆలయంలో తాజాగా వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండువగా ముగిసాయి. రోజుకో అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వారిని భారీగా భక్తులు దర్శించుకున్నారు. చివరి రోజు తమలపాకులతో విశేష అలంకరణలో భక్తులకు కార్యసిద్ధి గణపతిగా దర్శనమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వయంభువుగా వెలసిన రెండు వినాయక క్షేత్రాల్లో.. మొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకం కాగా రెండవది అనకాపల్లి జిల్లా చోడవరం ఆలయం. ఈ ఆలయంలో తాజాగా వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండువగా ముగిసాయి. రోజుకో అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వారిని భారీగా భక్తులు దర్శించుకున్నారు. చివరి రోజు తమలపాకులతో విశేష అలంకరణలో భక్తులకు కార్యసిద్ధి గణపతిగా దర్శనమిచ్చారు. పురాతన చరిత్ర కలిగిన ఆలయంలో మరో విశేషం… వినాయకుడి తొండం భూమి లోపలికి చొచ్చుకు ఉంటుంది. అందుకే అక్కడ నుంచి పూర్వం తరలించాలని అనుకున్నా విగ్రహం కదల్లేదని అన్నారు ప్రధాన అర్చకులు. స్వామివారికి రెండవ రోజు సింధూర అలంకరణ, మూడవ రోజు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగవ రోజు భస్మ అలంకరణ, ఐదవ రోజు కుంకుమ అలంకరణ, ఆరవ రోజు పసుపు అలంకరణ, ఏడవ రోజు చందన అలంకరణ, ఎనిమిదవ రోజు పసుపు, కుంకుమ అలంకరణ.. తొమ్మిదవ రోజు భస్మ సహిత చందన అలంకరణ చేశారు. ఆ తరువాత సాయంత్రం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి గణపతి నవరాత్రి ఉత్సవ ముగింపు సందర్భంగా పత్ర పుష్ప ఫల విశేష అలంకరణ చేశారు. భక్తులకు కార్యసిద్ధి గణపతి గా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
