అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??

అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??

Phani CH

|

Updated on: Dec 20, 2022 | 8:40 PM

బైక్‌పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తూ.. జరిమానాలు సైతం విధిస్తున్నారు.

బైక్‌పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తూ.. జరిమానాలు సైతం విధిస్తున్నారు. అయితే, హెల్మెట్ పెట్టుకోని వారు ఈ వీడియోను చూస్తే వారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుంది. బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి బస్సు కింద పడ్డాడు. అయితే హెల్మెట్‌ అతడి ప్రాణాలను కాపాడింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రియో డి జనీరోలోని బెల్ఫోర్డ్ రోక్సో ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అలెక్స్ సిల్వా పెరెస్, బ్రెడ్‌ కోసం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. ఒక మూల మలుపు వద్ద బస్సు ఎదురుగా రాగా, బైక్‌పై వెళ్తున్న అలెక్స్‌.. సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ నుంచి అదుపుతప్పి ఎగిరి బస్సు కింద పడ్డాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజ‌న్లు ఫిదా !!

విషాద సంఘటన.. కూతురిని అత్తారింటికి.. తండ్రిని స్మశానానికి !!

మరో మట్టిలో మాణిక్యం.. ల‌తాజీ పాట‌ను హృద్యంగా ఆల‌పిస్తూ..

ఏం క్రియేటివిటీ.. ఇలా కూడా ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టొచ్చా..

షాట్ కొడితే.. పోయింది బాల్ కాదు బ్యాట్.. అంపైర్‌ షాక్

Published on: Dec 20, 2022 08:40 PM