విషాద సంఘటన.. కూతురిని అత్తారింటికి.. తండ్రిని స్మశానానికి !!
కూతురి పెళ్లి జరుగుతుందన్న ఆనందం ఆ తండ్రి పూర్తిగా అనుభవించనేలేదు. తన కుమార్తె వివాహాన్ని ఆసాంతం చూడకుండానే తనువు చాలించాడు ఓ తండ్రి. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది.
కూతురి పెళ్లి జరుగుతుందన్న ఆనందం ఆ తండ్రి పూర్తిగా అనుభవించనేలేదు. తన కుమార్తె వివాహాన్ని ఆసాంతం చూడకుండానే తనువు చాలించాడు ఓ తండ్రి. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఉత్తరాఖండ్ అల్మోరాలో పెళ్లి సందర్భంగా ఆ ఇంట్లో మెహందీ ఫంక్షను వైభవంగా జరుగుతోంది. డిసెంబర్ 12న వివాహం జరగాల్సిం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 11న మెహందీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులంతా ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. వధువు తండ్రికూడా వారితో కలిసి డాన్స్ చేశారు. కూతురి వివాహం జరుగుతుందన్న ఆనందంలో ఆ తండ్రి ఎంతో సంబరంగా నృత్యం చేశారు. అయితే ఆ తండ్రి కుమార్తె వివాహం చూడకుండానే మృత్యు ఒడికి చేరుకున్నాడు. మెహందీ ఫంక్షన్‌లో డాన్స్ చేస్తుండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో మట్టిలో మాణిక్యం.. లతాజీ పాటను హృద్యంగా ఆలపిస్తూ..