పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజ‌న్లు ఫిదా !!

పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజ‌న్లు ఫిదా !!

Phani CH

|

Updated on: Dec 20, 2022 | 8:38 PM

అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు నెటిజన్లను, ప్రజలను చాలా ఆకట్టుకుంటాయి.

అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు నెటిజన్లను, ప్రజలను చాలా ఆకట్టుకుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నవ్వును తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తుంటాయి. ఇదిలాఉంటే.. పెద్ద పులి.. త‌న కంటప‌డ్డ ఏ జంతువునూ వ‌దిలిపెట్టదు. దాన్ని వేటాడి చంపేస్తుంది. అలాంటి పెద్దపులిని చూసి మిగ‌తా జంతువులు పారిపోతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో పులికి చిక్కక త‌ప్పదు. తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ చెట్టుపై కూర్చొని ఉన్న కోతిని వేటాడేందుకు ఓ పెద్ద పులి తెగ ప్రయత్నించింది. కోతి దాక్కున్న చెట్టుపైకి పులి కూడా వచ్చింది. ఇక కోతిని వేటాడేందుకు పులి తీవ్రంగా ప్రయ‌త్నించింది. కానీ కోతి తన తెలివి ప్రద‌ర్శించి పులిని ముప్పుతిప్పలు పెట్టింది. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకుతూ కోతి తప్పించుకుంది.. కోతి తెలివికి పెద్దపులి తిక‌మ‌క అయింది. కోతి మ‌రో కొమ్మపైకి ఎగ‌ర‌గానే, లాభం లేద‌నుకుని పులి చెట్టుపై నుంచి కింద‌కు దూకేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విషాద సంఘటన.. కూతురిని అత్తారింటికి.. తండ్రిని స్మశానానికి !!

మరో మట్టిలో మాణిక్యం.. ల‌తాజీ పాట‌ను హృద్యంగా ఆల‌పిస్తూ..

ఏం క్రియేటివిటీ.. ఇలా కూడా ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టొచ్చా..

షాట్ కొడితే.. పోయింది బాల్ కాదు బ్యాట్.. అంపైర్‌ షాక్

Published on: Dec 20, 2022 08:38 PM