500 మందికి దుప్పట్లు పంచిన బికారి
ఉత్తర భారతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఇళ్ళు లేని నిరుపేదలు రోడ్ల పై నిద్రిస్తూ చలికి గజగజా వణుకుతున్నారు. అటువంటి వారికి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఓ దాత వేడి చాయ్‌తోపాటు 500 దుప్పట్లు పంపిణీ చేశాడు. ఇంత పెద్ద మనసును చూపిన వ్యక్తి ధనవంతుడు కాదు.. ఆయన కూడా బిచ్చగాడే. రెండు కాళ్ల వైకల్యం ఉన్న రాజు బికారి వీల్‌ఛైర్ సాయంతో వీధుల్లో తిరిగి పోగు చేసిన డబ్బుతో సాటి పేదలకు ఈ సాయం చేశాడు.
కొవిడ్ కష్టకాలంలో మాస్కులు ధరించమని ప్రచారం చేస్తూ.. పేదల ఇళ్ల వద్దకు రేషను, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసాడు రాజు. స్వయానా ప్రధాని మోదీ తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో రాజుపై ప్రశంసలు కురిపించారు. నిరాశ్రయుల కోసం ఓ భవనం నిర్మించే పనిలో ప్రస్తుతం తాను ఉన్నట్లు రాజు తెలిపాడు. ఇటీవల కేరళలోని అలప్పుజా ప్రాంతంలోని ఓ యాచకుడు రోడ్డు ప్రమాదంలో మరణించి షాకిచ్చాడు. అతని బాక్స్‌ను తెరచి చూసిన అధికారులకు దిమ్మ తిరిగినట్లైంది. అందులో రద్దైన రూ.2 వేల నోట్లతో పాటు డాలర్లు ఇతర ఫారెన్ కరెన్సీ దొరికింది. లెక్కించి చూడగా ఏకంగా రూ.4.5 లక్షలు ఉన్నట్లు తేలింది. విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు షాక్ అయ్యారు. తిండి కోసం కిశోర్ డబ్బులు యాచించేవాడని అతడి వద్ద అంత డబ్బు ఉన్నవిషయం తమకు తెలియదన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో జమ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
