Bear Viral Video: ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, అడవుల్లోకి వెళ్లినా.. అప్పుడప్పుడు ఎలుగు బంట్లు కనిపిస్తుంటాయి. ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం సాధరణమైపోయింది కానీ, ఒకప్పుడు ఈ వన్యప్రాణులను అడవుల్లోనే చూసేవారు. లేదంటే జూలో చూసేవారు. సాధారణంగా ఎలుగు బంట్లుగానీ, ఇతర అడవి జంతువులుగానీ ఎదురైతే.. ఏదైనా పెద్ద చెట్టు చూసుకుని ఎక్కేయాలని చెబుతూ ఉంటారు పెద్దలు.
ఆ వీడియోలో ఒక పెద్ద ఎలుగు బంటి, దానిపిల్ల రెండూ ఓ చెట్టు పై నుంచి దిగుతున్నాయి. కాసేపటికే మరో చెట్టు ఎక్కాయి. ఉత్తరప్రదేశ్ లోని హిమాలయ పర్వాతాల సమీపంలోని అడవుల్లో తీసిన ఈ వీడియోను పర్వీన్ కాస్వాన్ తాజాగా పోస్ట్ చేశారు. చిన్నప్పుడు ఎలుగుబంట్లు కనిపిస్తే వెంటనే దగ్గరిలోని ఎత్తయిన చెట్లు ఎక్కాలని కథల్లో చెప్పేవారు. అది సరికాదని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. హిమాలయన్ బ్లాక్ బేర్, దాని పిల్ల రెండూ చెట్లు ఎలా ఎక్కుతున్నాయో చూడండి. ఇది నిన్ననే తీసిన వీడియో..అంటూ పర్వీన్ కాస్వాన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఐదారు గంటల్లోనే 40 వేల మందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేస్తున్నారు. ఎలుగుబంట్లు ఇలా చెట్లు ఎక్కేస్తే ఇక కాపాడుకోవడం ఎలాగంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంత సింపుల్ గా చెట్లు ఎక్కేస్తున్నాయి అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.