Voter Offers: ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు, స్థానిక అధికారులు, ప్రైవేటు సంస్థలు కలిసి సమష్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటు వేయడాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు అభి బస్ తెలిపింది.
ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు, స్థానిక అధికారులు, ప్రైవేటు సంస్థలు కలిసి సమష్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటు వేయడాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు అభి బస్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 నుంచి 15 తేదీల మధ్య చేసే ప్రయాణాలకు కూపన్ కోడ్ ABHIVOTE ఉపయోగించి, టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా 250 రూపాయల వరకు రాయితీ పొందొచ్చని చెప్పారు. ఇది కాక 100 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందన్నారు. సమ్మర్24 కూపన్ వినియోగించి, టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిలో రోజుకు ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేసి ఏసీ బహుమతిగా ఇవ్వనున్నారు.
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లోని ఓటర్లకు ర్యాపిడో ఆఫర్లు ప్రకటించింది. మే 13న పోలింగ్ బూత్‌కు వెళ్లేవారికి ఉచితంగా బైక్ ట్యాక్సీ, ఆటో, క్యాబ్ ప్రయాణాలు ఉచితం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కలిసి పోలింగ్ శాతం పెంచేందుకు ఈ ఆఫర్‌ను తెచ్చింది ర్యాపిడో. ఎన్నికల రోజున ఓటర్లు ‘వోట్ నౌ’ కోడ్‌ను ఉపయోగించి ర్యాపిడో యాప్ ద్వారా ఉచిత రైడ్‌లను పొందొవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

