బ్యాంకునుంచి నగదు డ్రా చేస్తున్నారా..జాగ్రత్త వీడియో
బ్యాంకు నుంచి నగదు డ్రా చేసేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రూ.2 లక్షలు డ్రా చేసుకుని బయట బైక్‌పై ఉంచిన శ్రీనును దొంగలు వెంబడించి, హోటల్ వద్ద ఆగినప్పుడు నగదును అపహరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. బ్యాంకుల వద్ద సాధారణ ప్రజల్లాగే తిరుగుతూ రెక్కీ నిర్వహించి, తమదైన శైలిలో డబ్బులు కొట్టేయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఈ తరహా ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటుచేసుకుంది. నర్సాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన ఉంగరాల శ్రీను పట్టణంలోని ఎస్.బి.ఐ బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఆ నగదును తన బుల్లెట్ బైక్ ట్యాంక్ పై ఉన్న కవర్‌లో ఉంచారు. అనంతరం ఇంటికి వెళ్తూ పంజా సెంటర్ లోని ఒక హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి ఆగారు. బైక్ పై డబ్బు ఉందన్న విషయం మర్చిపోయి, శ్రీను హోటల్లోకి వెళ్లగానే, బ్యాంకు నుంచి వెంబడించిన ఇద్దరు వ్యక్తులు బైక్ కవర్‌లో ఉన్న రెండు లక్షల రూపాయలను చాకచక్యంగా అపహరించారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
