చిన్నపిల్లల అల్లరి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. పిల్లతో గడిపినంత సేపు ఎలాంటి కష్టమైన ఇట్టే మర్చిపోయి గడిపేస్తారు పెద్దలు. కొన్ని కొన్ని సందర్భాల్లో పెంపుడు జంతువులు చేసే అల్లరి కూడా అందరికీ నచ్చుతుంది. ఇంట్లో ఉండే కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు వారి యజమానులతో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇక ఇంట్లోని వారంతా ఎటో బయటకు వెళ్తున్నారంటే అప్పుడు చూడాలి అవి చేసే హంగామా అంతాఇంతా కాదు. చిన్నపిల్లలు కదా తమను కూడా తీసుకువెళ్లాలన్నట్టుగా ఎలాగైతే మారం చేస్తారో..అచ్చం పెంపుడు జంతువులు కూడా చేస్తాయి. వెంటపడి బయటకు వెళ్లకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు వాటినుంచి తప్పించుకుని, దొంగచాటుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కేవలం కుక్కలు, పిల్లులే కాదు..ఏనుగులు కూడా తమ కావటి వారితో అల్లరిపడుతుంటాయి. అవి చేసే తుంటరి పనులతో యజమానులను ముప్పుతిప్పలు పెడుతుంటాయి. అచ్చం ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ పిల్ల ఏనుగు దాని కీపర్‌ని నిద్రపోనివ్వకుండా చేసి రచ్చ రచ్చ చేసింది. ఏనుగు పిల్ల హంగామాతో కీపర్ కూడా జతకట్టాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్‌గా మారిన ఈ వీడయోలో ముందుగా చుట్టు కంచెవేసిన ఉంచిన ప్రదేశం నుంచి ఓ పిల్ల ఏనుగు ఎలా తప్పించుకుందో చూడొచ్చు..ఒక్కో కాలు జాగ్రత్తగా బయటపెడుతూ..మెల్లిగా కంచెను దాటేస్తుంది. ఆ పక్కనే ఓ బెడ్ ఏర్పాటు చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు దాని కీపర్. కంచెలోంచి బయటపడ్డ ఏనుగు పిల్ల అతను నిద్రిస్తున్న బెడ్‌వద్దకు చేరింది. కాళ్లతో అతన్ని తట్టి లేపుతున్నట్టుగా వెంటపడింది. అతనిని నిద్రలేపి పక్కలోంచి బయటకు నెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఏనుగు పిల్ల ఎంత ప్రయత్నించిన అతడు పరుపు మీదనుంచి కిందకు దిగలేదు..అటు ఇటూ ఊపేస్తూ ఆ ఏనుగు పిల్ల చివరకు అటుపక్కనే ఉన్న ఆకుల కుప్పలో పడింది. కానీ, ఆ వెంటనే లేస్తుంది. మరోసారి అతని పక్క వద్దకు వచ్చి అల్లరి పెట్టింది. కీపర్ దాని అల్లరిని కట్టి పెట్టి తనతో పాటు పరుపు మీద పడుకోబెట్టుకుంటాడు..దాంతో ఆ పిల్ల ఏనుగు కూడా హాయిగా నిద్రపోతుంది. తాగుబోతు వ్యక్తి ఎలాంటి రచ్చ చేస్తాడో ఈ పిల్ల ఏనుగు సైతం అంతే స్థాయిలో హంగామా సృష్టించింది. ఇంత చేసినా కీపర్ ఏ మాత్రం ఆగ్రహించకుండా దానిని మచ్చిక చేసుకున్న విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంత చక్కటి వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ్ షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది…ఇలాంటి వీడియోలతో సంతోషకరమైన మానసిక స్థితి కలుగుతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మాటల్లో చెప్తే కాదు..వీడియో చూస్తే మీరు కూడా తెగ ఎంజాయ్ చేస్తారు..
Hey! That’s my bed..get up..? pic.twitter.com/WX4IaROsvp
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) May 10, 2022