Lord Shiva: ఆ శివలింగానికి పిడుగులే అభిషేకం.. ఇది ఎలా సాధ్యం?

Updated on: Feb 24, 2025 | 5:11 PM

చోళుల కాలం నాటి ఆలయం అది. పౌరాణికంగాను ప్రాముఖ్యత కలిగింది. శ్రీగిరిపై వెలిసిన ఆ దేవాలయంలో జరిగే ఒక వింత విస్తుపోయేలా చేస్తుంది. నెలకు ఒకసారి పడే పిడుగు మహాశివుడికి నిత్య అభిషేకంగా మారింది. నమ్మశక్యంగా లేదు కదా! కర్ణాటకలో కొలువైన ఆ బిజిలి మహాదేవుని మహత్యం ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి..

దేవుడు విద్యుచ్ఛక్తి లాంటివాడు. విద్యుత్‌ను ఒకసారి చూపించమని అడిగితే ఎవరూ చూపించలేరు. బెట్టడపురలో ఉన్న సిడ్లు మల్లికార్జున స్వామి ఆలయ రహస్యం కూడా ఇంచుమించు ఇలాంటిదే. శివుడికి నిజంగా పిడుగు అభిషేకం జరుగుతుందా? అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు మేము కర్ణాటకకు వెళ్లాం. మేము కర్ణాటకలో మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెట్టడపుర సిడ్లు మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి వివరాలు తెలుసకునే ప్రయత్నం చేశాం. గ్రామానికి చేరుకున్నాక ఒక వింతైన విషయం తెలిసింది. ఆలయంపై ప్రతి నెల పిడుగు పడుతుందన్నారు. కానీ అలా ఎందుకు జరుగుతుందనేది ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. పూర్తి డీటేల్స్ ఈ వీడియోలో…..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 24, 2025 05:08 PM