Bullet Train: రెండేళ్లలో బుల్లెట్‌ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌.

|

Mar 20, 2024 | 8:02 PM

భారత్‌లో బుల్లెట్‌ రైలు ఎప్పుడెప్పుడు పరుగులు పెడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గరపడుతోంది. మరో రెండేళ్ళలో దేశంలో బుల్లెట్‌ రైలు దూసుకెళ్లనుంది. ఈ విషయం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా వెల్లడించారు. దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు గురించి ఆయన కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

భారత్‌లో బుల్లెట్‌ రైలు ఎప్పుడెప్పుడు పరుగులు పెడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గరపడుతోంది. మరో రెండేళ్ళలో దేశంలో బుల్లెట్‌ రైలు దూసుకెళ్లనుంది. ఈ విషయం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా వెల్లడించారు. దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు గురించి ఆయన కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్‌ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు.. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై పలు విషయాలు వెల్లడించారు. బుల్లెట్‌ రైలు కోసం 500కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు కొన్నిదేశాలకు ఏకంగా 20 ఏళ్ల సమయం పట్టిందని, అయితే భారత్‌ వీటికి భిన్నంగా అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచస్థాయి సౌకర్యాలతో కేవలం పదేళ్లలోనే ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేయనుందని వెల్లడించారు. మొదట దీనిని గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు నడపనున్నటటు వివరించిన ఆయన 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి రానుందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్‌-ముంబయి మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు.

ఈ ఏడాది డిసెంబరు నాటికి తొలి మేడిన్‌ ఇండియా చిప్‌ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. వికసిత్‌ భారత్‌కు ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం చాలా కీలకమైనది. రానున్న ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో టాప్‌-5 దేశాల్లో భారత్‌ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీతో ఒప్పందం జరిగింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి మన దేశంలోని ఈ ప్లాంట్‌ నుంచి తొలి మేడిన్‌ ఇండియా చిప్‌ రానుంది. గుజరాత్‌లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌ 2026 డిసెంబరు నాటికి చిప్‌లను ఉత్పత్తి చేయనుందని వైష్ణవ్‌ వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 20, 2024 08:01 PM