Army Nurse: పెళ్లయిందని జాబ్ నుంచి తీసేస్తే.. అది వివక్షే.! కేంద్రానికి సుప్రీం షాక్.!
వివాహం కారణంగా ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడం వివక్షాపూరితమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్నీ రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది. సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసు విచారణ కొచ్చింది. ఆమెకు రూ.60 లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివాహం కారణంగా ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడం వివక్షాపూరితమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్నీ రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది. సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసు విచారణ కొచ్చింది. ఆమెకు రూ.60 లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహం అనంతరం సెలినా జాన్ అనే నర్సును 1988లో విధుల నుంచి తొలగించారు. అప్పుడు ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తొలుత ట్రైబ్యునల్‌కు వెళ్లమని న్యాయస్థానం సూచించడంతో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను 2019లో అత్యున్నత న్యాయస్థానం
ట్రైబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. వివాహ కారణాలతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనను 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. బాధితురాలు ప్రైవేటుగా కొంతకాలం నర్స్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ.60 లక్షలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..