లవ్ సింబల్‌లా తాటి చెట్లుపల్లెలో ప్రకృతి దృశ్యం
ప్రేమంటే ఏమిటి? చాలామంది చాలా రకాల నిర్వచనాలు చెబుతారు. కానీ ప్రకృతి మాత్రం ఒక్కోసారి హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా అలాంటిదే. ఓ పల్లెలో కనిపించిన దృశ్యమే దీనికి నిదర్శనం. ఈ తాటి చెట్లు చూడండి... ఇవి ఎటు చూపినా... ప్రేమ చిహ్నం లా కనిపిస్తాయి. మనసు నిండా ప్రేమను, శాంతిని, ఐక్యతను వ్యక్తం చేస్తున్నట్టు ఈ చెట్ల ఆకారాలు.. చూసినవారి మనసుని తాకుతాయి.
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని ఈ చెట్లు.. రెండు రాష్ట్రాల తరపున ప్రేమను ప్రదర్శిస్తున్నట్టుగా ఉన్నాయంటున్నారు సందర్శకులు. తమ వద్దకు వచ్చే వారందరికీ.. ఈ తాటి చెట్లు ప్రేమ, సహనాలను బోధిస్తున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ వికసించటానికి మూరో వ్యక్తి అవసరమైనట్లుగా.. ఈ రెండు తాటి చెట్ల మధ్య మరో తాటి చెట్టు కనిపిస్తుంది. ఇలాంటి చెట్లు ప్రకృతిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ లవ్ సింబల్ ఆకారంలోని తాటిచెట్లను చూసి.. యువత ఫిదా అవుతోంది. ఈ వింత తాటి చెట్లు గాలి వీచే సమయంలో.. ప్రేయసీ ప్రియులు కలిసి.. ఉత్సాహంగా ప్రేమ గీతం పాడుతున్నట్లు అనిపిస్తుంది. గాలి వచ్చిన సమయంలో అవి ఊగే తీరు.. ప్రేమలో మునిగితేలే జత.. ఆనందంలో తల ఊపుతున్నట్లు కనపిస్తోంది. ఇవి కేవలం చెట్లు కాదని, ప్రేమ గొప్పదనాన్ని చెప్పేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఉదాహరణ అని స్థానికుల అభిప్రాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే…
టీచర్లకు బిగ్ రిలీఫ్.. ఎగ్జాం పేపర్లు దిద్దుతున్న.. ఏఐ
దేశంలోనే రిచెస్ట్ విలేజ్.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు
తప్పటడుగు.. 100కోట్ల హిట్ సినిమా మిస్సు ! పాపం అఖిల్
మీరు నీళ్లు నిలబడి తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
