Early periods with Corona: ఆడవాళ్ళూ జాగ్రత్త.. కరోనాతో మరో దిగ్భ్రాంతికరమైన వాస్తవం.. బాలికల్లో ముందస్తు రజస్వల.!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం మరువలేనిది.. అయితే తాజా అధ్యయనం భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మైనర్ బాలికలు ముందస్తు రజస్వల అవడానికి దారి తీస్తోందన్న దిగ్భ్రాంతికరమైన విషయం బయట పడింది.

Early periods with Corona: ఆడవాళ్ళూ జాగ్రత్త.. కరోనాతో మరో దిగ్భ్రాంతికరమైన వాస్తవం.. బాలికల్లో ముందస్తు రజస్వల.!

|

Updated on: Oct 27, 2022 | 9:10 AM


కరోనా తర్వాత బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. సాధారణంగా బాలికలు 13 నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, 8 ఏళ్లకే అవుతున్నట్లు గుర్తించారు. చిన్నారి వయసు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలలు. అప్పుడే పీరియడ్స్‌ మొదలయ్యాయని ఢిల్లీలోని ప్రముఖ పీడియాట్రిక్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ మన్‌ప్రీత్‌ సేథీ చెప్పారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10 వరకూ వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయని వెల్లడించారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌నట. ఆ సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితయ్యారు. విద్యార్థులకు ఆటపాటలు కూడా లేవు. ఫలితంగా వారిలో జీవక్రియలు ప్రభావితమయ్యాయి. మన మెదడు మన శరీరం ఎత్తును కాకుండా బరువును మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్‌ ప్రారంభమవుతాయి. ఇందులో హార్మోన్ల స్థాయి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బరువును నియంత్రణలో ఉంచుకుంటే ముందుస్తు రజస్వలను అరికట్టవచ్చంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us