పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ వాసుకు వెంటనే సమాచారం ఇచ్చారు. వాసు వచ్చి ఆ పామును పట్టుకునే వరకు అంతా భయం భయంగానే గడిపారు. అందులోనూ ఆ జర్రిపోతు శబ్దం చేస్తూ అందరిని పరుగులు పెట్టించింది. అటు ఇటు తిరుగుతూ హడలిపెట్టింది. దీంతో వాసు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మొత్తానికి ఆ జర్రిపోతును బంధించగలిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అక్కడికి చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ చేతిలో ఉన్న పామును ఆయన తీసుకున్నారు. తన చేతిలో పట్టుకుని ఆ పాముకు సపర్యలు చేశారు. జీవ వైవిధ్యంలో పాములు భాగమని వాటి ఉనికిని కాపాడాలని అన్నారు. వాటికి హాని తలపెట్టకపోతే అవి మనుషులను ఏమీ చేయవని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు.