దొంగతనానికి వెళ్ళినవారు దొంగతనం అనంతరం ఇంట్లో బండలపై కొబ్బరి నూనె చల్లి అక్కడినుంచి పరారయ్యారు. ఫింగర్ ప్రింట్స్ సహా ఇతర ఆధారాలు దొరక్కండా దొంగలు కొత్త పందాన్ని ఎంచుకోవడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే రెండు ఇళ్లల్లో చోరీ చేసి దుండగులు పరారయ్యారు. స్థానిక మెట్టువీధిలో నివాసం ఉంటున్న రైతు ఉస్మాన్ ఓ ఎన్నిక కార్యక్రమం కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ పయనమయ్యాడు. కొన్ని నిమిషాల తర్వాత ఉస్మాన్ కుమారుడు ఏదో వస్తువు కోసం తిరిగి ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఇంటి తాళం తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూశారు. ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలగొట్టి లక్ష నగదు, మూడు తులాల బంగారం 50 తులాల వెండిని కొట్టేసినట్లు గుర్తించారు. ఇక్కడ మరో ట్విస్ట్ తరపైకి వచ్చింది. దొంగతనం అనంతరం ఆ దొంగలు ఇంట్లో నుంచి వెళ్ళే సమయంలో ఇంట్లో ఉన్న బండారాలపై మొత్తం కొబ్బరి నూనెను చల్లా రు. ఇలా ఇల్లు మొత్తం చల్లి వెళ్ళిపోయారు. అయితే బాధితుడు ఉస్మాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.