Ganapati idol: పొదల మధ్య అతిపురాతన మహాగణపతి ప్రత్యక్షం.. వీడియో వైరల్.

|

Aug 23, 2023 | 9:23 PM

తవ్వకాల్లో పురాతన విగ్రహాలు.. నిధి నిక్షేపాలు బయటపడటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. పొదల మధ్య వినాయక విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. గణపతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హన్మకొండ పరిమళ కాలనీలో ఊహించని విధంగా గణపతి విగ్రహం ప్రత్యక్షమైంది.

తవ్వకాల్లో పురాతన విగ్రహాలు.. నిధి నిక్షేపాలు బయటపడటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. పొదల మధ్య వినాయక విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. గణపతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హన్మకొండ పరిమళ కాలనీలో ఊహించని విధంగా గణపతి విగ్రహం ప్రత్యక్షమైంది. నాళాపక్కన ఉన్న ముళ్ల పొదల్లో గణేష్‌ రాతి విగ్రహాన్ని గుర్తించిన స్థానికులు జేసీబీ సాయంతో విగ్రహాన్ని బయటకు తీసారు. ఆ విగ్రహాన్ని నీటితో అభిషేకించి, శుద్ధి చేసి వేదపండితుల సమక్షంలో విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించారు. కాలనీవాసులంతా అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఐతే ఈ విగ్రహం ఎక్కడిది..? ఇటీవల వరదల కారణంగా ఎక్కడి నుండి నుండైనా కొట్టుకు వచ్చిందా..? లేక ఇక్కడే మట్టిలో కూరుకుపోయిన విగ్రహం బయటపడిందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ విగ్రహం రూపును బట్టి ఇది కాకతీయుల కాలం నాటి విగ్రహంగా భావిస్తున్నారు. ఇంతకాలం మట్టిలో కూరుకుపోయిన విగ్రహం ఇప్పుడు వరదల ప్రభావంతో బయటపడిందని భావిస్తున్నారు. త్వరలో గణపతి నవరాత్రి ఉత్సవాలు రాబోతున్న నేపథ్యం లో ఇక్కడ గణపతి విగ్రహం బయటపడడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆథ్యాత్మిక వాతావరణం అలముకుంది. స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాలవారు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతిని దర్శించుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...