జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..

Updated on: Mar 28, 2025 | 4:59 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్లు ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఎలుగుబంట్లు ఎక్కడ తమపై దాడిచేస్తాయోనని భయపడిపోతున్నారు. కర్ణాటక సరిహద్దులోని మడకశిర పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచరిస్తుండటం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చిరు.

ఆ ఎలుగుబంట్ల సంచారం వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో స్థానికంగా మరింత భయం నెలకొంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతం మడకశిర లోని కిల్లర్లపల్లి గ్రామంలో రెండు ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేశాయి. గ్రామంలోని మహిళలు, పిల్లలు అంతా భయంతో పరుగులు తీశారు. ఏ క్షణంలో ఏ ఇళ్లలో చొరబడతాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు ధైర్యం చేసి ఎలుగుబంట్లను గ్రామం నుంచి తరిమివేసే ప్రయత్నం చేశారు. పెద్దగా కేకలు వేస్తూ వాటిని బెదగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో ఎలుగుబంట్లు సమీపంలోని కొండల్లోకి పారిపోయాయి. ఎలుగుబంట్లను బంధించి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్‌

హీరోయిన్ లే.. గీరోయిన్‌ లే…! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్‌

TOP 9 ET News: యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా

రేసు నుంచి సల్మాన్ ఔట్.. అల్లు అర్జున్‌తో అట్లీ మూవీ..?

Prabhas: ప్రభాస్ పెళ్లి అప్డేట్‌.. రియాక్ట్ అయిన రెబల్ స్టార్