Anant Ambani-Radhika: మోస్ట్ స్టైలిష్ పీపుల్ లిస్టులో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్.!
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ దంపతులు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచ దేశాలనుంచి ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహం అప్పట్లో ఆద్యంతం ప్రత్యేకంగా నిలిచింది. వివాహ ఆహ్వాన పత్రికనుంచి నిశ్చితార్థం, వివాహ క్రతువు అన్నీ ప్రత్యేకమే.
ఇటు సంప్రదాయానికి పెద్ద పీటవేస్తూనే అటు ఫ్యాషన్ ప్రియులను సైతం అలరించింది వీరి వివాహ వేడుక.అంగరంగ వైభవంగా జరిగిన ప్రతి వేడుకలోనూ వధూవరులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. అందుకే అనంత్-రాధిక జంట న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ లిస్టులో చోటు సంపాదించుకొని మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ‘మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో అనంత్- రాధిక అత్యంత స్టైలిష్ వ్యక్తుల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వివాహ సమయంలో వారు ధరించిన దుస్తులు, నగలు, అత్యంత వైభవంగా జరిగిన వారి వివాహ కార్యక్రమాలు మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అనంత్- రాధికల నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబయిలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగింది. వివాహం ఈ ఏడాది జులైలో సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలతో పాటు అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. వారి పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సెలబ్రిటీలు, ప్రపంచ దేశాల నేతలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిరువురు పలు విలువైన ఫాషన్ దుస్తుల్లో మెరిశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.