Lift Accident: మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే తెరుచుకున్న తలుపులు..

|

Aug 29, 2024 | 3:59 PM

ఇంట్లో కూర్చుని బోరు కొట్టి కాసేపు అలా బయటకు వెళ్దామనుకున్న ఓ వృద్ధుడు ఊహించని విధంగా మృతి చెందాడు. ఇంట్లో అందరూ బయటకు వెళ్లడంతో వృద్ధ దంపతులిద్దరే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో పెద్దాయన బయటకు వెళ్దామని, నాలుగో అంతస్తులోని లిఫ్ట్‌ దగ్గరకు వచ్చాడు. లిఫ్ట్ బటన్‌ నొక్కాడు. అయితే లిఫ్ట్‌ రాకుండానే డోర్‌ తెరుచుకుంది. అది గమనించని ఆ పెద్దాయన అందులో కాలు పెట్టగానే అమాంతం కిందపడిపోయాడు.

హైదరాబాద్‌ శివారులోని గుడిమల్కాపూర్‌లో జరిగిందీ ఘటన. రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయిన 65 ఏళ్ల ఎంఎస్ సమియుల్లా బేగ్ స్థానిక ప్రియా కాలనీలో ఉంటున్నారు. బేగ్ ఈ నెల 17న కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లగా ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో బేగ్ తాముండే నాలుగో ఫ్లోర్ నుంచి కిందికి వెళ్లాలని అనుకుని ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన అపార్ట్‌మెంట్లలోని లిఫ్ట్‌ల పనితీరుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.