Viral Video: సంచిలో పసికందుతో వృద్ధుడు.. ఆటోలో వెళ్తుండగా ఏడ్చిన పసికందు.. వీడియో.

Viral Video: సంచిలో పసికందుతో వృద్ధుడు.. ఆటోలో వెళ్తుండగా ఏడ్చిన పసికందు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 31, 2023 | 10:34 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలో గుండెల్ని పిండేసే ఘటన వెలుగు చూసింది. రోజులు కూడా గడవని పసిబిడ్డను సంచిలో పెట్టుకుని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు ఓ వృద్దుడు. పసికందును సంచిలో పెట్టుకుని ఆటోలో వెళ్తుండగా.. ఒక్కసారిగా ఏడ్చింది శిశువు. సంచిలోంచి శబ్ధం రావడంతో ఆటోడ్రైవర్‌కు అనుమానం వచ్చింది. సంచిలో ఏముందని వృద్ధుడిని అడిగాడు. అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే ఆటోను ఆపి చెక్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలో గుండెల్ని పిండేసే ఘటన వెలుగు చూసింది. రోజులు కూడా గడవని పసిబిడ్డను సంచిలో పెట్టుకుని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు ఓ వృద్దుడు. పసికందును సంచిలో పెట్టుకుని ఆటోలో వెళ్తుండగా.. ఒక్కసారిగా ఏడ్చింది శిశువు. సంచిలోంచి శబ్ధం రావడంతో ఆటోడ్రైవర్‌కు అనుమానం వచ్చింది. సంచిలో ఏముందని వృద్ధుడిని అడిగాడు. అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే ఆటోను ఆపి చెక్ చేశాడు. సంచిలో పసిబిడ్డను చూసి షాక్ అయ్యాడు. వృద్దుడిని పట్టుకుని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ ద్వారా వృద్దుడి వివరాలు సేకరించిన పోలీసులు, ఆ దిశగా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ చిన్నారిని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో తెలుసుకుని అవాక్కయ్యారు. ఐదు రోజుల క్రితం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ఇద్దరి పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రిలోని నర్సు సహాయంతో ఓ ముసలి వ్యక్తికి బిడ్డను అప్పగించారు దంపతులు. అలా బిడ్డను తీసుకుని వెళ్తున్న ఆ వృద్ధుడ్ని ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు అప్పగించాడు. దాంతో ఈ విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బిడ్డను ఎక్కడకు తీసుకెళ్తున్నాడనే కోణంలో దర్యాప్తు విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..