చిట్టీల పేరుతో రూ. 7కోట్ల టోకరా !! ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు
తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో భారీ మోసాలు పెరుగుపోతున్నాయి. అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు కట్టించుకోవడం.. ఆ డబ్బు తీసుకుని పరార్ అవడం కామన్ గా మారిపోయింది. తాజాగా అనంతపురం జిల్లాలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా చిట్టీల పేరుతో 7 కోట్ల రూపాయిల కుచ్చుటోపి..ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకు ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు. ఒకటేంటి..?
తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో భారీ మోసాలు పెరుగుపోతున్నాయి. అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు కట్టించుకోవడం.. ఆ డబ్బు తీసుకుని పరార్ అవడం కామన్ గా మారిపోయింది. తాజాగా అనంతపురం జిల్లాలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా చిట్టీల పేరుతో 7 కోట్ల రూపాయిల కుచ్చుటోపి..ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకు ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు. ఒకటేంటి..? ఎన్ని వెర్రి వేషాలో వేయాలో..అన్నీ వేషాలు వేసి కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనంతపురం జిల్లా సాయినగర్‌కు చెందిన రామాజంజనేయులు..వృత్తి ల్యాబ్‌టెక్నీషియన్, ప్రవృత్తి మాత్రం చిట్టీల వ్యాపారం. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే రామాంజనేయులు , అక్కడ పనిచేసే వైద్యులు, నర్సులు, రోగి బంధువులతో చనువుగా మాట్లాడి అధికవడ్డీ ఇస్తానని నమ్మించి చిట్టీల రొంపిలోకి దింపేవాడు. దాదాపు వందలాది మంది నుంచి 7కోట్లకుపైగా వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా…వడ్డీ కాదు కదా..కనీసం అసలు కూడా ఇవ్వకపోవడంతో చిట్టీ కట్టినవారంతా రామాంజనేయులును నిలదీశారు. దాంతో కొద్దిరోజులుగా అతను కనిపించకుండాపోవడంతో బాధితులు స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మొదలైన సలార్ ట్రైలర్ కౌంట్‌డౌన్ | ఇప్పుడప్పుడే కాదు.. ఇంకా టైం ఉంది
Tiger Nageswara Rao: టైగర్ నాగశ్వరరావుకు ఝలక్.. హైకోర్ట్ సీరియస్
Pawan Kalyan: వావ్ !! 470కిలోల వెండితో పవన్ బొమ్మ
Salaar: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ !!