Bihar: విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్‌ప్రెస్ రైలు.. వీడియో.
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్ జిల్లాలో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు దూసుకెళ్లింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ముంబైకి బయలుదేరింది.
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్ జిల్లాలో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు దూసుకెళ్లింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం… పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ముంబైకి బయలుదేరింది. కాసేపటికి ఎస్-11 కోచ్‌లో పెద్ద శబ్దాలు వినిపించాయి. రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు అప్రమత్తం కావడంతో సమస్యను గుర్తించే ప్రయత్నం చేశారు.
పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు భగవాన్‌పుర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరగా.. ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపేశారు. ఆ తర్వాత కొంతమంది ప్రయాణికులు రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు తనిఖీ చేయగా ఎస్-11 కోచ్ చక్రం విరిగిపోయినట్లుగా గుర్తించారు. రైల్వే ఇంజినీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్ కు చేరుకొని చక్రానికి మరమ్మతులు చేపట్టింది. పవన్ ఎక్స్‌ప్రెస్‌లో చక్రం విరిగిందని తమకు సమాచారం అందిందని, వెంటనే తమ బృందం అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసిందని తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ సీపీఆర్వో వీరేంద్ర కుమార్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

