Elephant Video: మురుగు గుంతలో పడిపోయిన ఏనుగు.. అధికారుల ఐడియాకు హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజనం.. వీడియో

|

Mar 05, 2022 | 9:13 AM

సాధారణంగా జంతువులు కాలువల్లో, గుంతల్లో పడిపోతే తాళ్ల సాయంతో లేకపోతే మరో విధంగానో కాపాడడం మనం చూస్తుంటాం. కానీ కోల్‌కతా లోని అటవీ అధికారులు తమ మెదడుకు పదును పెట్టారు. చిన్నప్పుడు ఆర్కిమెడిస్‌ బోధించిన సూత్రాన్ని అమలుచేసి గోతిలో పడిపోయిన


సాధారణంగా జంతువులు కాలువల్లో, గుంతల్లో పడిపోతే తాళ్ల సాయంతో లేకపోతే మరో విధంగానో కాపాడడం మనం చూస్తుంటాం. కానీ కోల్‌కతా లోని అటవీ అధికారులు తమ మెదడుకు పదును పెట్టారు. చిన్నప్పుడు ఆర్కిమెడిస్‌ బోధించిన సూత్రాన్ని అమలుచేసి గోతిలో పడిపోయిన భారీ ఏనుగును రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తూ పెద్ద మురుగు గుంతలో పడిపోయింది. ఈ విషయం సమీపంలోని అటవీ అధికారులకు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు గోతిలో పడిపోయిన ఏనుగును పరిశీలించారు. దానిని బయట తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ గుంత చాలా లోతుగా ఉండటంతో తీయడం కష్టంగా అనిపించింది. దీంతో తమ మెదడుకు పదును పెట్టిన అటవీ అధికారులు చిన్నప్పుడు తాము చదువుకున్న ఆర్కిమెడిస్‌ సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. వెంటనే తమ ప్లాన్‌ను అమలు చేశారు.ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు ఏనుగు పడిన గోతిని పైపుల ద్వారా నీటితో నింపారు. దీంతో క్రమంగా ఆ ఏనుగు నీటిపై తేలింది. అనంతరం పెద్ద తాళ్లను ఏనుగు కాళ్ల కిందకు చేర్చి మెల్లగా దానిని పైకి లాగారు. ఇలా సుమారు మూడు గంటలపాటు శ్రమించి.. చివరకు తెల్లవారుజాము 4 గంటలకు ఆ ఏనుగును సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘అటవీశాఖ అధికారులు ఆర్కిమెడిస్‌ సూత్రం సహాయంతో ఏనుగును కాపాడారు. నా మాటలు నమ్మలేకపోతే ఈ వీడియోను చూడండి’ అని తన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా తెలివిగా ఏనుగును కాపాడారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్

Follow us on