Record In Mallakhamb: పదేళ్ల వయసులో అద్భుత రికార్డు.. చిచ్చరపిడుగుపై ప్రధాని ప్రశంసలు..(వీడియో)

Updated on: Oct 18, 2022 | 9:32 AM

గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో పదేళ్ల చిన్నారి రికార్డు సృష్టించాడు. ఆతిథ్య రాష్ట్రానికి చెందిన శౌర్యజిత్ ఖైరే పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతే కాదు మల్లాఖాంబ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు.


పతకాల పట్టికలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా.. హర్యానా రెండో ప్లేస్ లో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో మహారాష్ట్ర అక్టోబరు 10న మూడు బంగారు పతకాలు సాధించింది. వీటితో కలిపి మహారాష్ట్ర ఖాతాలో 34 స్వర్ణాలు చేరాయి. 26 రజతాలు, 56 కాంస్య పతకాలు సాధించి అత్యధికంగా 126 పతకాలను సాధించింది. ఆర్మీ 53 స్వర్ణాలు సాధించి జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. అంతే కాకుండా హర్యానా కూడా 100 పతకాలు సాధించింది.పదేళ్ల వయయులో పతకం సాధించిన శౌర్య జిత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. తన తన విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడని కొనియాడారు. గుజరాత్ ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 12 రజతాలు, 18 కాంస్య పతకాలతో 43 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఈ గుజరాత్ చిచ్చరపిడుగుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఖైరే మల్లఖంబ్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 09:32 AM