Amul doodle: వేలును వెన్నలోనే పెట్టు.. వైరల్ అవుతున్న అమూల్‌ డూడుల్‌..

ఇటీవల రవీంద్రజడేజాకు ఐసీసీ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ అనుమతి లేకుండా వేలికి క్రీమ్‌ రాసుకున్నందుకు

Amul doodle: వేలును వెన్నలోనే పెట్టు.. వైరల్ అవుతున్న అమూల్‌ డూడుల్‌..

|

Updated on: Feb 22, 2023 | 9:00 PM

ఇటీవల రవీంద్రజడేజాకు ఐసీసీ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ అనుమతి లేకుండా వేలికి క్రీమ్‌ రాసుకున్నందుకు ఐసీసీ ఫీజు కోతతోపాటు డీమెరిట్‌ పాయింట్‌కు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో అమూల్‌ డూడుల్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దాంతో ఈ డూడుల్‌ నెట్టింట వైరల్‌ అవుతూ రచ్చ చేస్తోంది. ‘స్టార్ ఇండియన్ ఆల్ రౌండర్ బంతిపై క్రీమ్ రాసినందుకు జరిమానా!’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ‘జడ్డూ ఉంగ్లీ సిర్ఫ్ బటర్ మే దాలో!’ అంటే.. వెన్నలో వేలును మాత్రమే పెట్టు అని ఉన్న ఈ ఫొటో అమూల్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోను ఇప్పటికే 72వేలమందికిపైగా వీక్షించారు. 7,600 మందికి పైగా లైక్‌ చేశారు. వందలమంది రీ ట్వీట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అరచేతి నుంచి ఓ పదార్థాన్ని తీసుకొని ఎడమ చేతి చూపుడు వేలుకు రుద్దడం కనిపించింది. అయితే, బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వైద్యపరమైన కారణాలతోనే క్రీమ్‌ను వాడినట్లు ఐసీసీ తెలిపింది. బాల్‌ ట్యాంపరింగ్‌పై వచ్చిన ఆరోపణలు ఖండించింది. క్రీమ్‌ను బంతికి పూయలేదని, ఫలితంగా బంతిలో ఎలాంటి మార్పులు రాలేదని ఐసీసీ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us