Viral Video: ఆంధ్ర అమ్మాయి.. అమెరికా అబ్బాయి.. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ పెద్దలేమన్నారంటే..

|

Aug 18, 2022 | 8:26 AM

ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పని ఉండదు. ఈ ప్రపంచంలో పూర్తి స్వతంత్రం కలిగింది ఏదైనా ఉంది అంటే.. అది ప్రేమే. ఒక్కసారి అది ఎంట్రీ ఇచ్చిందంటే..


ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పని ఉండదు. ఈ ప్రపంచంలో పూర్తి స్వతంత్రం కలిగింది ఏదైనా ఉంది అంటే.. అది ప్రేమే. ఒక్కసారి అది ఎంట్రీ ఇచ్చిందంటే.. దానిని సాధించుకోడానికి ఆ ప్రేమికులు యుద్ధం చేయాల్సిందే. అంత పవర్‌ఫుల్‌. కొందరి విషయంలో యుద్ధాలు లేకుండానే శాంతియుతంగానే ప్రేమ ఫలిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రాజాల ఉదయ్‌శంకర్‌, కుసుమ దంపతులు విజయవాడలో విజయవాడలో స్థిరపడ్డారు. వీరి కుమార్తి నివేదిత ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లింది. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తనతోపాటు పనిచేస్తున్న చికాగోకు చెందిన బైరాన్‌ అనే వ్యక్తి నివేదితపై మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పాడు. దాంతో ఆంధ్రా అమ్మాయి తన తల్లిదండ్రుల అంగీకారం అవసరమని చెప్పింది. ఇద్దరూ కలిసి విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులముందుంచారు. వారు కూడా వీరి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో గోకవరం మండలంలోని కృష్ణుని పాలెంలో ఉన్న నివేదిత బంధువుల ఇంట్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 11న విజయవాడలో ఆంధ్రా అమ్మాయికి, చికాగో అబ్బాయికి పెళ్లి జరగనున్నట్టు బంధువులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 18, 2022 08:26 AM