వాహ్.. ఏం క్రియేటివిటీ బాస్.. బట్టలు ఉతకడం ఇంత ఈజీనా
ఒకప్పుడు బావులు, చెరువుల దగ్గర బట్టలు ఉతికేవారు. అలాంటి పరిస్థితి నుండి వాషింగ్ మెషిన్ లో సర్ఫ్, డిటర్జెంట్ లిక్విడ్ వేసి ఒక్క బటన్ నొక్కితే బట్టలు వాటికవే వాష్ అయిపోయేంతగా సాంకేతికత అభివృద్ది చెందింది. అయితే వాషింగ్ మెషిన్ అందరూ కొనుక్కోలేరు. ఒక వేళ కొన్నా నెల నెలా కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. వీటన్నింటికి చెక్ పెట్టే ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఔట్ డోర్ వాషింగ్ మెషిన్' సహాయంతో కరెంట్ బిల్ ఖర్చు లేకుండా హాయిగా ఎన్ని బట్టలు అయినా ఉతుక్కోవచ్చు.
ఒకప్పుడు బావులు, చెరువుల దగ్గర బట్టలు ఉతికేవారు. అలాంటి పరిస్థితి నుండి వాషింగ్ మెషిన్ లో సర్ఫ్, డిటర్జెంట్ లిక్విడ్ వేసి ఒక్క బటన్ నొక్కితే బట్టలు వాటికవే వాష్ అయిపోయేంతగా సాంకేతికత అభివృద్ది చెందింది. అయితే వాషింగ్ మెషిన్ అందరూ కొనుక్కోలేరు. ఒక వేళ కొన్నా నెల నెలా కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. వీటన్నింటికి చెక్ పెట్టే ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఔట్ డోర్ వాషింగ్ మెషిన్’ సహాయంతో కరెంట్ బిల్ ఖర్చు లేకుండా హాయిగా ఎన్ని బట్టలు అయినా ఉతుక్కోవచ్చు. అదెలాగంటే.. ఈ వీడియోలో చెక్కలతో తయారు చేసిన ఒక బుట్ట లాంటిదానిని వాలుగా నీరు ప్రవహిస్తున్న చోట సెట్ చేశారు. బుట్ట లోపల బట్టలు వాష్ చేయడానికి ఎలాంటి ఏర్పాటు చేశారో స్పష్టంగా తెలియడం లేదు కానీ పై నుండి నీరు ఆ బుట్టలోకి వెళుతుంటే ఆ బుట్టలో బట్టలు అచ్చం వాషింగ్ మెషిన్ లో తిరిగినట్టు తిరుగుతున్నాయి. బహుశా ఈ బుట్టలోపల చక్రం లాంటి సెట్టింగ్ ఉండవచ్చని అంటున్నారు. ఇది చాలా సహజంగా ఉందని, గ్రామీణ ప్రాంతాలలో నీటి ప్రవాహాల దగ్గర ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రజలందరూ సామూహికంగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట !!
నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన
Kiran Abbavaram: ఇందుకే.. తొందర పడొద్దు అని చెప్పేది !!
Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోంది !!