Mobile Users: మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

|

May 10, 2024 | 6:03 PM

ప్రస్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే మొట్టమొదట చేసేపని ఫోన్‌ ఓపెన్‌ చేయడం. రోజు ప్రారంభం ఫోన్‌తో.. ముగింపు ఫోన్‌తోనే జరుగుతోంది. అంతగా సెల్‌ఫోన్‌ మన జీవితంలో భాగమైపోయింది. వినియోగదారులు రకరకాల బ్రాండ్ల ఫోన్లు వాడుతుంటారు. అయితే, షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఫోన్‌లలో ప్రమాదకర వైరస్‌ను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు.

ప్రస్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే మొట్టమొదట చేసేపని ఫోన్‌ ఓపెన్‌ చేయడం. రోజు ప్రారంభం ఫోన్‌తో.. ముగింపు ఫోన్‌తోనే జరుగుతోంది. అంతగా సెల్‌ఫోన్‌ మన జీవితంలో భాగమైపోయింది. వినియోగదారులు రకరకాల బ్రాండ్ల ఫోన్లు వాడుతుంటారు. అయితే, షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఫోన్‌లలో ప్రమాదకర వైరస్‌ను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో ఏప్రిల్‌ 25 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను నిపుణులు గుర్తించారు. వ్యక్తిగత డాటా భద్రతకు ముప్పు పొంచి ఉందంటున్నారు.

ఈ వివరాలను ఓవర్‌ సెక్యూర్డ్‌ అనే బ్లాగ్‌లో ప్రచురించారు. MIUI , హైపర్‌ఓఎస్‌ వినియోగించే ఫోన్‌లలో ఈ సమస్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. షావోమీ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌ యాప్‌ లలో లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని తెలిపారు. ఈ భద్రతాపరమైన లోపాల గురించి చైనాకు చెందిన షావోమీ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని, కాని వినియోగదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.