Airport Railway Station: 18 మంది ప్రయాణికుల కోసం కోట్లు రూపాయలతో రైల్వేస్టేషన్..! ఎందుకంటే…
కోట్లు ఖర్చు చేసి రైల్వే స్టేషన్ నిర్మిస్తే.. కనీస ప్రయాణికులు కూడా కరువయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం..
కోట్లు ఖర్చు చేసి రైల్వే స్టేషన్ నిర్మిస్తే.. కనీస ప్రయాణికులు కూడా కరువయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌పోర్టు హాల్ట్ రైల్వే స్టేషన్‌కు నిత్యం కేవలం 18 మంది ప్రయాణికులు సంచరిస్తున్నారు. దాదాపు రెండు కోట్లు వ్యయంతో నిర్మించిన నూతన రైల్వేస్టేషన్ ప్రయాణికులకు నిరుపయోగకరంగా మారింది. ఈ రూట్లో ఉదయం, సాయంత్రం మాత్రమే ఒక రైలు ప్రయాణిస్తోంది. విమానాశ్రయంలో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు మాత్రమే ఈ ట్రెయిన్‌లో వస్తుండటం విశేషం. మిగిలిన ప్రయాణికులు ఎవరూ రైలు ఎక్కడం లేదు. ఉదయం ఆరు గంటలకు సిటీ రైల్వేస్టేషన్ నుంచి రైలు బయలుదేరుతోంది. ఈ స్టేషన్‌లో దిగి అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది. సమయానికి అక్కడ బస్సులు ఉండవు. ఇబ్బందులు పడే బదులు ట్యాక్సీలో వెళ్లడం ఉత్తమమనే అభిప్రాయం ప్రయాణికుల్లో ఉంది. దీంతో రైల్లో సంచరించే వారి సంఖ్య తగ్గిపోయింది. దేవనహళ్లి రైల్వేస్టేషన్‌లో రోజు పది టిక్కెట్‌లు అమ్ముడుపోతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
