Air plane crash: ల్యాండ్‌ అవుతుండగా విమాన ప్రమాదం.. 173 మంది ప్రయాణికులు..(వీడియో)

Updated on: Nov 03, 2022 | 8:23 PM

ఫిలిప్పీన్స్‌లో భారీ ప్రమాదం తప్పింది. కొరియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే పైనుంచి దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


కొరియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కేఈ631 ఎయిర్‌బస్‌ విమానం 173 మంది ప్రయాణికులతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ నగరం నుంచి ఫిలిప్పీన్స్‌ బయలుదేరింది. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌లోని సెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. అయితే ప్రతికూల వాతావరణం వల్ల రన్‌వై పైనుంచి పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Nov 03, 2022 08:21 PM