Yadadri: అగర్ వత్తులు తయారీ.. ఎలా చేస్తారో ఎప్పుడైనా చూసారా..? ఎక్స్‌క్లూజీవ్ వీడియో.

|

Nov 20, 2022 | 9:37 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మహిళలు వాగ్మి అనే పేరుతో అగరుబత్తుల తయారీ ప్రారంభించారు. యాదగిరిగుట్ట కొండపైన ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మహిళలు వాగ్మి అనే పేరుతో అగరుబత్తుల తయారీ ప్రారంభించారు. యాదగిరిగుట్ట కొండపైన ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో తిరుమలలో మాదిరిగానే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేయనున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహా­లు చేస్తున్నారు.జిల్లాకు చెందిన మహిళలు వాగ్మీ మహిళా సంఘంగా ఏర్పడి అదే బ్రాండ్ పేరుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి దేవ స్థానం సహకారంతో అగరు బత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ముడి సరకులు కొన్ని యాదాద్రి దేవస్థానం నుంచి అందుతున్నాయి. ఇందులో దేవస్థానానికి సంబంధించిన పూలు, ఆవుపేడ, కొబ్బరి చిప్పలను వాడుతున్నారు. రానున్న రోజుల్లో వాగ్మి పేరిట కుంకుమ, పసుపు, కొబ్బరిచిప్పలతో ఆకృతులను తయారు చేసి విపణిలో విక్రయానికి తీసుకొస్తామని సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆలేరు, యాదగిరిగుట్ట పట్టణాలకు చెందిన 18 మంది రిసోర్స్ పర్సన్లు పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరికి మంచి ప్రతిఫలం అందనుంది.యంత్రాలకు సహకారం..అగరుబత్తుల తయారీకి అవస రమైన యంత్రాలను దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ చూపారు. ఆలేరులోని ఇండోర్ స్టేడియంలో వీటిని తయారు చేస్తున్నారు…. తయారు చేసిన ఉత్పత్తులను వాగ్మి కటాక్ష, వాగ్మి సుమధుర పేరుతో యాదాద్రి దేవస్థానంతో పాటు స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారు..వీటిని ఈనెల 2వ తేదీన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం అగరుబత్తుల తయారీకి పరిమితమైనప్పటికీ రానున్న కొద్ది రోజుల్లోనే పసుపు, కుంకుమ, వివిధ ఆకృతుల ఉత్పత్తులను తయారు చేయిస్తాం. సంఘంతో పాటు వీటి తయారీలో పనిచేసే వారికి మంచి ఉపాధి లభిస్తుంది. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నష్టాలు రాకుండా కలెక్టర్ సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తాసిల్దార్ రామకృష్ణ అన్నారు…

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 20, 2022 09:37 AM