Aga Khan Palace Video: వెలుగుల్లో ఆగా ఖాన్‌ ప్యాలెస్‌ ధగధగలు.. మువ్వన్నెల రంగుల వెలుగుల్లో కట్టడాలు  100 కోట్ల పండగ..(వీడియో)

Aga Khan Palace Video: వెలుగుల్లో ఆగా ఖాన్‌ ప్యాలెస్‌ ధగధగలు.. మువ్వన్నెల రంగుల వెలుగుల్లో కట్టడాలు 100 కోట్ల పండగ..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 26, 2021 | 5:20 PM

దేశం 100 కోట్ల కరోనా డోసుల రికార్డు పండుగను ఘనంగా జరుపుకుంటోంది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, భాజపా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పురావస్తుశాఖ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంది.

దేశం 100 కోట్ల కరోనా డోసుల రికార్డు పండుగను ఘనంగా జరుపుకుంటోంది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, భాజపా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పురావస్తుశాఖ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంది. 100 కోట్ల డోసులకు సూచనగా , ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, శాస్త్రవేత్తలు, టీకా తయారీ దారులు, దేశ పౌరుల కృషికి అభినందనలుగా 100 వారసత్వ కట్టడాలను మువ్వన్నెల జెండా వెలుగులలో నింపేస్తున్నారు. 
ఇది పుణెలోని సుప్రసిద్ధ ఆగా ఖాన్‌ ప్యాలెస్‌ ఇలా మువ్వన్నెల రంగుల వెలుగుల్లో ధగధగా మెరిసింది. చిమ్మ చీకట్లో కళ్ళు చెదిరే రంగులతో ఇలా ఆశ్చర్యపరిచింది. పుణెలోని యెరవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో కొలువైంది. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఆగా ఖాన్‌ పాలెస్‌లో గాంధీజీ, కస్తూర్బా ఇతర స్వాతంత్ర్యసమరయోధులు బందీలుగా ఉన్నారు.మనదగ్గర హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై కూడా ఈ రంగులు ప్రదర్శించనున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన 17 కట్టడాలైన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టాంబ్‌, తుగ్లకాబాద్‌ ఫోర్ట్‌, పురానా ఖిలా, ఫతేపూర్ సిఖ్రీ, రామప్ప ఆలయం, హంపి, ధోలవీర, పురాతన లేహ్‌ ప్యాలస్ లు రంగులమయం కానున్నాయి.
మనదేశంలో జనవరి 16న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. నేటికి 100 కోట్ల డోసులు పంపిణీ పూర్తయింది. తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌ ఈ ఫీట్ సాధించింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)