పట్టెడన్నం తిన్న విశ్వాసం.. 64 కి.మీ నడిచి యజమాని చెంతకు చేరిన శునకం

పట్టెడన్నం తిన్న విశ్వాసం.. 64 కి.మీ నడిచి యజమాని చెంతకు చేరిన శునకం

Phani CH

|

Updated on: May 08, 2023 | 9:49 AM

పెంపుడు కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటిని ఫ్యామిలీలో ఒకరిగానే చూసుకుంటుంటారు. అవి కూడా అంతే విశ్వాసంతో ఉంటాయి. పట్టెడన్నం పెడితే చాలు ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడతాయి. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పెంపుడు కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటిని ఫ్యామిలీలో ఒకరిగానే చూసుకుంటుంటారు. అవి కూడా అంతే విశ్వాసంతో ఉంటాయి. పట్టెడన్నం పెడితే చాలు ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడతాయి. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని కోసం చేసిన సాహసం గురించి తెలిస్తే తప్పకుండా మీరు ఎమోషనల్ అవుతారు. ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌కు చెందిన ఓ వ్యక్తి కుక్కను పెంచుకుందామని, మరో వ్యక్తి దగ్గర నుంచి కూపర్ అనే కుక్కను తెచ్చుకున్నాడు. కుక్కను తన కారులో కూర్చోబెట్టుకుని ఎంతో ప్రేమగా ఇంటికి తెచ్చుకున్నాడు. కానీ ఆ కుక్క పాత యజమానిపై ఉన్న విశ్వాసంతో కారు దిగగానే పారిపోయింది. పాత ఓనర్‌ను వెతుక్కుంటూ పరుగులు తీసింది. 27 రోజుల పాటు తిండి లేకుండా దాదాపు 40 మైళ్లు పరుగెత్తింది. చివరికి లండన్‌డెరీ కౌంటీలోని టోబెర్‌మోర్‌లోని పాత యజమాని ఇంటికి చేరుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమల కోసం తిరుగులేని మాస్టర్ ప్లాన్.. చూస్తే షాకవ్వాల్సిందే

మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు

Samantha: సమంతపై టెన్నిస్‌ స్టార్‌ ప్రశంసలు.. ఎందుకంటే ??

Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్‏కు ఏమైంది ??