AC Buying Tips: సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్ యాప్‌లలో, బయట మార్కెట్లలో ఏసీల విక్రయాలు పెరిగాయి. ఏసీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాలి. రేటింగ్, వారంటీ వంటి వాటిని పరిశీలించాకే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా గది సైజుకి తగ్గట్టు ఏసీ తీసుకోవాలి.
వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఏసీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్ యాప్‌లలో, బయట మార్కెట్లలో ఏసీల విక్రయాలు పెరిగాయి. ఏసీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాలి. రేటింగ్, వారంటీ వంటి వాటిని పరిశీలించాకే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా గది సైజుకి తగ్గట్టు ఏసీ తీసుకోవాలి. 110 చదరపు అడుగుల గదికి 1 టన్ను, 110 నుంచి 160 చదరపు అడుగుల గదికి 1.5 టన్నులు, 160 నుంచి 200 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా రేటింగ్ చూడాలి. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నవి తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ తీసుకుంటే మంచిది. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కూడా కొనుక్కోవచ్చు. ఏసీతో పాటు తప్పకుండా స్టెబిలైజర్ కొనుగోలు చేయాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారా మేనేజ్ చేయవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. పీసీబీ వారంటీ ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. పీసీబీ పాడైతే 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. కనీసం 5 సంవత్సరాల పీసీబీ వారంటీ, 10 సంవత్సరాల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.