Drone Bomb: డ్రోన్ల ద్వారా బాంబుల వర్షం.. వంద మంది పైగా మృతి.. ఎక్కడంటే..?
బాంబుల వర్షంతో సిరియా దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్‌లోని మిలటరీ అకాడమీ పై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 125 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం హోమ్స్ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో మిలటరీ సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు.
బాంబుల వర్షంతో సిరియా దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్‌లోని మిలటరీ అకాడమీ పై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 125 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం హోమ్స్ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో మిలటరీ సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. కార్యక్రమంలో ఆ దేశ రక్షణ మంత్రి కూడా పాల్గొన్నారు. అయితే ఆయన వెళ్లిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడి జరిగింది. కార్యక్రమం ముగింపు సమయంలో ఆ ప్రాంతంలో డ్రోన్లు బాంబులను జార విడిచాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రక్తం మడుగుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపించాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. సిరియాలో గత 12 ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతున్నప్పటికీ డ్రోన్లతో బాంబు దాడులు చేయడం గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదు. సాయుధ డ్రోన్లు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన నెలకొంది. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..