ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనం..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం..వీడియో
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జల్సాలకు అలవాటుపడి దొంగగామారి, చివరికి జైలు పాలయ్యాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటకు చెందిన కాళహస్తి హరీశ్‌కృష్ణ గాజుల రామారంలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న హరీశ్‌కృష్ణ బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడ్డాడు.
నెలకు వచ్చే లక్షా 10వేల జీతం జల్సాలు, అప్పులకు సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో తన కంపెనీలో పనిచేసే కేవీ.మణికంఠతో హరీశ్‌కృష్ణకు పరిచయం ఏర్పడింది. మాదాపూర్ చంద్రానాయక్ తండాలో ఉండే మణికంఠ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూప్ చాటింగ్ ద్వారా ఈ నెల 25న మణికంఠ ఇంట్లో లేడన్న విషయాన్ని నిర్ధారించుకున్నాడు. ఆ రోజు ఉదయం 11.15 గంటలకు ముఖానికి ముసుగు, తలకు హెల్మెట్ ధరించి వాళ్లింటికి వెళ్లాడు. మణికంఠ భార్యను కత్తితో బెదిరిస్తూ ఒంటిపైనున్న నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె అతడిని ప్రతిఘటించడంతో చేతికి గాయమైంది. ఇదే అదునుగా ఆమె చేతి గాజులు లాక్కుని పరారయ్యాడు.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది
పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!
రంజీ ప్రాక్టీస్‌లో కోహ్లీ స్టైల్ చూశారా!
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు !

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
