Samosa in train: ఆకలేస్తోందని సమోసా కొంటే.. సగం తిన్నాక కనిపించింది చూసి షాక్‌..!

Updated on: Oct 15, 2022 | 9:46 PM

అజిత్ కుమార్ అనే వ్యక్తి.. బాంద్రా – లక్నో రైలులో అక్టోబర్ 9 న లక్నో వెళ్లాడు. ప్రయాణ సమయంలో అతను IRCTC ప్యాంట్రీ నుంచి సమోసాను కొనుగోలు చేశాడు. కానీ కొంత సమోసాను తిన్న తర్వాత దానిలో


అజిత్ కుమార్ అనే వ్యక్తి.. బాంద్రా – లక్నో రైలులో అక్టోబర్ 9 న లక్నో వెళ్లాడు. ప్రయాణ సమయంలో అతను IRCTC ప్యాంట్రీ నుంచి సమోసాను కొనుగోలు చేశాడు. కానీ కొంత సమోసాను తిన్న తర్వాత దానిలో పసుపు రంగులో ఉన్న ప్యాకెట్ కనిపించింది. దాంతో షాక్ అయిన అజిత్.. ఐఆర్‌సీటీసీ కి కంప్లైంట్ చేశాడు. ప్యాంట్రీ ద్వారా పరిశుభ్రమైన ఆహారం సరఫరా అవుతోంది అంటూ వ్యంగ్యంగా తను కొనుగోలు చేసిన సమోసా ఫోటోతో పాటు ట్విట్టర్‌ద్వారా కంప్లైంట్ చేశారు. అయితే.. ప్రయాణీకుడు ట్వీట్ చేసిన వెంటనే అతనికి IRCTC నుంచి సమాధానం వచ్చింది. అందులో ‘సార్, అసౌకర్యానికి క్షమించండి. దయచేసి పీఎస్ఆర్, మొబైల్ నంబర్‌ను డీఎమ్ లో షేర్ చేయాలని సూచించారు. కాగా.. ఐఆర్సీటీసీ ఇచ్చిన సమాధానంతో ప్రజలు అంసతృప్తికి గురయ్యారు. అంతే కాకుండా వారు ఈ ట్వీట్‌కి వివిధ రకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇస్తున్నారు.దేశ రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైల్వేలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా క్రమంగా ప్రయాణీకులకు అందించే సౌకర్యాలను రైల్వే పెంచుతోంది. అయినప్పటికీ.. రైళ్లలో లభించే ఆహార పదార్థాల్లో ఇప్పటికీ మార్పు రావడం లేదు. స్టేషన్లలో అమ్మే తినుబండారాల నుంచి రైళ్లల్లో అందించే భోజన సదుపాయాల వరకు ఎందులోనూ ఛేంజెస్ లేవు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 15, 2022 09:46 PM