Viral Video: మంచి మనసు చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌ ఆపదలో ఉన్న గర్భిణికి ప్రసవం చేసి డాక్టర్ గా మరీనా వైనం..

కొన్ని సంఘటనలు మనం ఏపనైనా చేసేలా చేస్తాయి. అవసరమైతే మనకు సంబంధం లేని పనులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే

Viral Video: మంచి మనసు చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌ ఆపదలో ఉన్న గర్భిణికి ప్రసవం చేసి డాక్టర్ గా మరీనా వైనం..

|

Updated on: Sep 26, 2022 | 9:53 AM


కొన్ని సంఘటనలు మనం ఏపనైనా చేసేలా చేస్తాయి. అవసరమైతే మనకు సంబంధం లేని పనులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..వేలూరు సౌత్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువరాణి సెప్టెంబర్‌ 18 రాత్రి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ వస్త్ర దుకాణం వద్ద 35 ఏళ్ల యాచకురాలు ప్రసవం నొప్పులతో ఇబ్బంది పడుతోంది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన యువరాణి మరో పోలీస్ కానిస్టేబుల్ తో కలిసి ఆమెకు ప్రసవం చేసింది. దాంతో ఆ యాచకురాలుకు ఆడ శిశువు జన్మించింది. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందించి తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను విచారించగా.. భర్త వదిలి వెళ్లి పోవడంతో దిక్కులేక భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. మహిళా పోలీసులు ఆమెకు బట్టలు, మరికొన్ని వస్తువులను అందజేశారు. ఆపదలో ఉన్న మహిళకు ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ యవరాణిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నవజాత శిశువును పట్టుకుని ఉన్న పోలీసు ఫోటోను చాలా మంది ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇప్పుడు ఈఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us